తస్యాః కిఞ్చిత్కరధృతమివ
శ్లోకః
తస్యాః కిఞ్చిత్కరధృతమివ ప్రాప్తవానీరశాఖం
హృత్వా నీలం సలిలవసనం ముక్తరోధోనితమ్బమ్ ।
ప్రస్థానం తే కథమపి సఖే లమ్బమానస్య భావి
జ్ఞాతాస్వాదో వివృతజఘనాం కో విహాతుం సమర్థః ॥1.44॥
పదవిభాగః
తస్యాః కిఞ్చిత్ కర-ధృతమ్ ఇవ ప్రాప్త-వానీర-శాఖం హృత్వా
నీలం సలిల-వసనం ముక్త-రోధః-నితమ్బమ్ । ప్రస్థానం తే కథమ్ అపి సఖే లమ్బమానస్య
భావి జ్ఞాత-ఆస్వాదః వివృత-జఘనాం కః విహాతుం సమర్థః ॥
అన్వయః
సఖే, కిఞ్చిత్ కరధృతమ్ ఇవ ప్రాప్తవానీరశాఖం ముక్తరోధోనితమ్బమ్ తస్యాః నీలం
సలిలవసనం హృత్వా లమ్బమానస్య
తే ప్రస్థానం కథమ్ అపి భావి, కః జ్ఞాతోస్వాదః వివృతజఘనాం విహాతుం సమర్థః ॥1.44॥
ప్రతిపదార్థః
సఖే = మిత్రుడా
కిఞ్చిత్ = కొద్దిగా
కరధృతమ్ ఇవ ప్రాప్తవానీరశాఖం = చేతితో
పట్టుకున్నట్లున్న ప్రబ్బలి చెట్ల కొమ్మలను కలిగి ఉన్నది
ముక్తరోధోనితమ్బమ్ = విడువబడిన (బట్టబయలైన) ఒడ్డు అనే పిరుదు కలది అయిన
తస్యాః = ఆమె యొక్క
నీలం సలిలవసనం = నల్లని నీరు అనే బట్టను
హృత్వా = తొలగించి
లమ్బమానస్య తే = వ్రేలాడుతున్న నీ యొక్క
ప్రస్థానం = ప్రయాణము
కథమ్ అపి = ఏదో విధంగా (కష్టం మీద)
భావి = సాగుతుంది
జ్ఞాతోస్వాదః కః =
రుచిని తెలిసినవాడు ఎవడు
వివృతజఘనాం = దిగంబరమైన కటిప్రదేశము కలది
విహాతుం = వదిలివేయుటకు
సమర్థః = సమర్థుడు
తాత్పర్యమ్
“ఒడ్డు అనే పిరుదుపైనుంచి జారుతున్నదీ, ప్రబ్బలి (బెత్తము/పేము) చెట్టు కొమ్మల
వేళ్ళతో అంటి పెట్టుకొన్నదీ అయిన ఆ గంభీరానది యొక్క నల్లని నీరు అనే బట్టను తొలగించి, వ్రేలాడుతున్న నీ ప్రయాణం సాగటం కష్టంతో కూడుకున్నదే. రుచి తెలిసినవాడెవడైనా దిసమొలతోనున్న
ప్రియురాలిని ఎలా వదిలిపెట్టగలడు?”
Comments
Post a Comment