హిత్వా హాలామభిమతరసాం
శ్లోకః
హిత్వా హాలామభిమతరసాం రేవతీలోచనాఙ్కాం
బన్ధుప్రీత్యా సమరవిముఖో లాఙ్గలీ యాః సిషేవే ।
కృత్వా తాసామధిగమమపాం సౌమ్య సారస్వతీనామ్
అన్తః శుద్ధస్త్వమపి భవితా వర్ణమాత్రేణ కృష్ణః ॥1.52॥
పదవిభాగః
హిత్వా హాలామ్ అభిమత-రసాం రేవతీ-లోచన-అఙ్కాం బన్ధు-ప్రీత్యా సమర-విముఖః లాఙ్గలీ యాః సిషేవే । కృత్వా తాసామ్ అధిగమమ్ అపాం సౌమ్య సారస్వతీనామ్ అన్తః శుద్ధః త్వమ్ అపి భవితా వర్ణ-మాత్రేణ కృష్ణః ॥
అన్వయః
సౌమ్య, బన్ధుప్రీత్యా సమరవిముఖః లాఙ్గలీ అభిమతరసాం రేవతీలోచనాఙ్కాం హాలామ్ హిత్వా యాః సిషేవే తాసామ్ సారస్వతీనామ్ అపాం అధిగమమ్ కృత్వా త్వమ్ అపి అన్తః శుద్ధః భవితా వర్ణమాత్రేణ కృష్ణః ॥1.52॥
ప్రతిపదార్థః
సౌమ్య = ఓ సౌమ్యుడా
బన్ధుప్రీత్యా = బంధువులపై ప్రేమతీ
సమరవిముఖః లాఙ్గలీ = సమరము నుంచి విముఖుడైనటువంటి హలధారి యైన బలరాముడు
అభిమతరసాం = ఇష్టమైన రుచి కలిగినది
రేవతీలోచనాఙ్కాం = రేవతి కన్నుల గుర్తు ఉన్నది (అందులో తన కళ్ళ నీడ పడినది అని)
హాలామ్ = మధువును
హిత్వా = స్వీకరించి
యాః = వేటిని
సిషేవే = సేవించాడో
తాసామ్ సారస్వతీనామ్ అపాం = సరస్వతీనదీజలాలను
అధిగమమ్ కృత్వా = సేవించి
త్వమ్ అపి = నీవు కూడా
అన్తః శుద్ధః = లోపల శుద్ధిని కలవాడవు
భవితా = కాగలవు
వర్ణమాత్రేణ కృష్ణః = కేవలము (దేహపు) రంగు కారణముగానే నల్లనివాడివి
తాత్పర్యమ్
“ఓ మెత్తని చిత్తపు వాడా, కురుక్షేత్రమున జరిగిన యుద్ధమునకు బంధుప్రీతి కారణముగా దూరముగా ఉండిన బలరాముడు - రేవతి కన్నుల నీడలు ప్రతిఫలించిన మధువును ఇష్టముగా త్రాగినవాడు - ఏ సరస్వతీనదీజలాలను సేవించాడో ఆ సరస్వతీనదీజలాలను సేవించి అతని వలనే అంతశ్శుద్ధిని పొందుము. చూపులకు కృష్ణుడివైనా, లోపల నిర్మలత్వము కలవాడవౌతావు.”
(నైమిశారణ్యములో తను ప్రవేశించినప్పుడు, తనను స్వాగతించేందుకు లేవలేదనే కోపంతో బలరాముడు సూతుడిని చంపుతాడు. ఆ పాపపు ప్రాయశ్చిత్తము కొరకు ఒక ఏడాది పాటు బ్రహ్మచర్యము పూని, సరస్వతీజలసేవనము చేసాడు)
Comments
Post a Comment