బ్రహ్మావర్తం జనపదమ్
శ్లోకః
బ్రహ్మావర్తం జనపదమథ చ్ఛాయయా గాహమానః
క్షేత్రం క్షత్రప్రధనపిశునం కౌరవం తద్ భజేథాః ।
రాజన్యానాం శితశరశతైర్యత్ర గాణ్డీవధన్వా
ధారాపాతైస్త్వమివ కమలాన్యభ్యవర్షన్ముఖాని ॥1.51॥
పదవిభాగః
బ్రహ్మావర్తం జనపదమ్ అథ ఛాయయా గాహమానః క్షేత్రం క్షత్ర-ప్రధన-పిశునం కౌరవం తత్ భజేథాః । రాజన్యానాం శిత-శర-శతైః యత్ర గాణ్డీవ-ధన్వా ధారా-పాతైః త్వమ్ ఇవ కమలాని అభ్యవర్షత్ ముఖాని ॥
అన్వయః
అథ బ్రహ్మావర్తం జనపదమ్ ఛాయయా గాహమానః (సన్)
క్షత్రప్రధనపిశునం తత్ కౌరవం క్షేత్రం భజేథాః యత్ర
గాణ్డీవధన్వా శితశరశతైః రాజన్యానాం ముఖాని త్వమ్ ధారాపాతైః కమలాని
ఇవ అభ్యవర్షత్ ॥1.51॥
ప్రతిపదార్థః
అథ = అటుపైన
బ్రహ్మావర్తం జనపదమ్ బ్రహ్మావర్తమనే జనపదమును
ఛాయయా = నీడతో
గాహమానః (సన్) = దాటినవాడవై
క్షత్రప్రధనపిశునం = క్షత్రియుల యొక్క యుద్ధమును సూచించే
తత్ కౌరవం క్షేత్రం = ఆ కురుక్షేత్రమును
భజేథాః = సేవించుము (వెళ్ళుము)
యత్ర = ఎక్కడైతే
గాణ్డీవధన్వా = గాండీవమనే ధనుస్సు కలవాడు (అర్జునుడు)
శితశరశతైః = వందలాది నిశితమైన బాణాలతో
రాజన్యానాం = రాజుల యొక్క
ముఖాని = ముఖములను (తలలను)
త్వమ్ = నీవు
ధారాపాతైః = ధారాపాతంగా
కమలాని ఇవ = తామరలను వలె
అభ్యవర్షత్ = వర్షించాడో
తాత్పర్యమ్
“ఆ తరువాత, బ్రహ్మావర్తదేశముపై నీ నీడను ప్రసరింపజేసి, కురుపాండవుల రణక్షేత్రమైన
కురుక్షేత్రమునకు వెళ్ళుము. నీవు తామరపూవులపై ఎడతెరపి లేని వానలను కురిసినట్లు, గాండీవధారియైన
అర్జునుడు వందల కొలది పదునైన బాణాలను (శత్రు)రాజుల తలలపై కురిపించిన చోటు అది.”
Comments
Post a Comment