త్వయ్యాదాతుం జలమవనతే

శ్లోకః
త్వయ్యాదాతుం జలమవనతే శార్ఙ్గిణో వర్ణచౌరే
తస్యాః సిన్ధోః పృథుమపి తనుం దూరభావాత్ ప్రవాహమ్
ప్రేక్షిష్యన్తే గగనగతయో నూనమావర్జ్య దృష్టీ-
రేకం ముక్తాగుణమివ భువః స్థూలమధ్యేన్ద్రనీలమ్ 1.49

పదవిభాగః
త్వయి ఆదాతుం జలమ్ అవనతే శార్ఙ్గిణః వర్ణ-చౌరే తస్యాః సిన్ధోః పృథుమ్ అపి తనుం దూర-భావాత్ ప్రవాహమ్ ప్రేక్షిష్యన్తే గగన-గతయః నూనమ్ ఆవర్జ్య దృష్టీః ఏకం ముక్తా-గుణమ్ ఇవ భువః స్థూల-మధ్య-ఇన్ద్రనీలమ్

అన్వయః
జలమ్ ఆదాతుం అవనతే శార్ఙ్గిణః వర్ణచౌరే త్వయి గగనగతయః పృథుమ్ అపి దూరభావాత్ తనుం  తస్యాః సిన్ధోః ప్రవాహమ్ నూనమ్ దృష్టీః ఆవర్జ్య భువః ఏకం స్థూలమధ్యేన్ద్రనీలమ్ ముక్తాగుణమ్ ఇవ ప్రేక్షిష్యన్తే 1.49

ప్రతిపదార్థః
జలమ్ = నీటిని
ఆదాతుం = స్వీకరించుటకు
శార్ఙ్గిణః వర్ణచౌరే త్వయి అవనతే = విష్ణువుయొక్క (నల్లని) రంగును దొంగిలించిన నీవు దిగుతూ ఉండగా
గగనగతయః = ఆకాశములో విహరించే వారు (దేవతలు)
నూనం = తప్పక
పృథుమ్ అపి = పెద్దది అయినప్పటికీ
దూరభావాత్ = దూరము కారణముగా
తనుం = చిన్నది అయిన (అట్లా కనిపించే)
తస్యాః సిన్ధోః ప్రవాహమ్ = నది యొక్క ప్రవాహమును
స్థూలమధ్యేన్ద్రనీలమ్ భువః ఏకం ముక్తాగుణమ్ ఇవ = భూమి యొక్క పెద్ద ఇంద్రనీలమణి మణితో ఉన్న ముత్యపు గొలుసు ప్రేక్షిష్యన్తే  = చూస్తారు

తాత్పర్యమ్
విష్ణువు యొక్క రంగును దొంగిలించిన నీవు, ఆ చర్మణ్వతీనదిలోని నీటిని గ్రహించేందుకు భూమి మీదకు దిగి ఉన్నప్పుడు, ఆకాశములో విహరిస్తూ ఉన్న దేవతల కంటికి పెద్దదైనప్పటికీ ఆనది దూరము నుంచి సన్నగా, పెద్ద ఇంద్రనీలమణిని మధ్యలో పొదిగిన ఒంటి వరుస ముత్యాల పేరు లాగా కనబడుతుంది.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...