గమ్భీరాయాః పయసి
శ్లోకః
గమ్భీరాయాః పయసి సరితశ్చేతసీవ ప్రసన్నే
ఛాయాత్మాఽపి ప్రకృతిసుభగో లప్స్యతే
తే ప్రవేశమ్ ।
తస్మాదస్యాః కుముదవిశదాన్యర్హసి త్వం న ధైర్యా-
న్మోఘీకర్తుం చటులశఫరోద్వర్తనప్రేక్షితాని ॥1.43॥
పదవిభాగః
గమ్భీరాయాః పయసి సరితః చేతసీ ఇవ ప్రసన్నే ఛాయా-ఆత్మా అపి ప్రకృతి-సుభగః లప్స్యతే తే
ప్రవేశమ్ । తస్మాత్ అస్యాః కుముద-విశదాని అర్హసి త్వం న ధైర్యాత్ మోఘీకర్తుం చటుల-శఫర-ఉద్వర్తన-ప్రేక్షితాని ॥
అన్వయః
గమ్భీరాయాః సరితః ప్రసన్నే పయసి (ప్రసన్నే)
చేతసీ ఇవ ప్రకృతిసుభగః తే ఛాయాత్మా అపి ప్రవేశమ్
లప్స్యతే, తస్మాత్ అస్యాః కుముదవిశదాని చటులశఫరోద్వర్తనప్రేక్షితాని
త్వం ధైర్యాత్ మోఘీకర్తుం న అర్హసి ॥1.43॥
ప్రతిపదార్థః
గమ్భీరాయాః సరితః = గంభీరానది యొక్క
ప్రసన్నే పయసి = నిర్మలమైన జలములలో
(ప్రసన్నే) చేతసీ ఇవ
= నిర్మలమైన హృదయములో వలె
ప్రకృతిసుభగః = సహజసుందరమైన
తే ఛాయాత్మా అపి = నీయొక్క ఛాయారూపము
ప్రవేశమ్ లప్స్యతే = ప్రవేశాన్ని పొందుతుంది
తస్మాత్ = అందువలన
అస్యాః = దీనియొక్క
కుముదవిశదాని = కలువల తెలుపులను
చటులశఫరోద్వర్తనప్రేక్షితాని = మిలమిల మెరిసే చేపల ఎగసిపాటుల చంచలమైన
చూపులను
త్వం = నీవు
ధైర్యాత్ = సాహసించి (ధూర్తత్వము చూపి)
మోఘీకర్తుం = వ్యర్థము చేయుటకు
న అర్హసి = తగవు
తాత్పర్యమ్
“తన ప్రసన్నమైన హృదయము వలెనున్న గంభీరానది యొక్క నిర్మలజలములలోనికి సహజసుందరమైన
నీ ప్రతిబింబానికి ప్రవేశం లభిస్తుంది. ఆ నది - తెల్లని కలువల కన్నులతో, గాలిలోకి ఎగురుతూ
మిలమిలమెరిసే శఫరములనే చేపలను చూపులుగా నీ వంక ప్రసరిస్తున్నది. ఆ చూపులను వ్యర్థం
చేయటం నీకు తగదు.”
(శఫరము – కొర్రమీను)
Comments
Post a Comment