తస్మిన్ కాలే నయనసలిలం...
శ్లోకః
తస్మిన్ కాలే నయనసలిలం యోషితాం ఖణ్డితానాం
శాన్తిం నేయం ప్రణయిభిరతో వర్త్మ భానోస్త్యజాశు ।
ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్పాభ్యసూయః ॥1.42॥
పదవిభాగః
తస్మిన్ కాలే నయన-సలిలం యోషితాం ఖణ్డితానాం శాన్తిం నేయం
ప్రణయిభిః అతః వర్త్మ భానోః త్యజ ఆశు । ప్రాలేయ-అస్రం కమల-వదనాత్ సః అపి హర్తుం నలిన్యాః ప్రత్యావృత్తః
త్వయి కర-రుధి స్యాత్ అనల్ప-అభ్యసూయః ॥
అన్వయః
తస్మిన్ కాలే ప్రణయిభిః ఖణ్డితానాం యోషితాం నయనసలిలం శాన్తిం నేయం, అతః భానోః వర్త్మ ఆశు త్యజ । నలిన్యాః కమలవదనాత్ ప్రాలేయాస్రం
హర్తుం ప్రత్యావృత్తః
సః అపి త్వయి
కర-రుధి స్యాత్ అనల్ప-అభ్యసూయః ॥1.42॥
ప్రతిపదార్థః
తస్మిన్ కాలే = ఆ సమయమునందు
ప్రణయిభిః = ప్రియుల చేత
ఖణ్డితానాం యోషితాం = దుఃఖితలైన యువతుల
నయనసలిలం = కన్నీరు
శాన్తిం నేయం = శమింప చేయదగియున్నది
అతః = అందు చేత
భానోః వర్త్మ = సూర్యుడి దారిని
ఆశు = వెంటనే
త్యజ = విడిచిపెట్టుము।
నలిన్యాః కమలవదనాత్ = తామరల ముఖపద్మము నుంచి
ప్రాలేయాస్రం = మంచు కన్నీటిని
హర్తుం = తొలగించుటకు
ప్రత్యావృత్తః సః అపి = తిరిగి వస్తున్న అతడు
త్వయి కరరుధి = నీ చేత కిరణములు అడ్డగించబడినప్పుడు
అనల్పాభ్యసూయః = తక్కువ కాని కోపము/అసహనమును
కలిగినవాడు
స్యాత్ = అవుతాడు
తాత్పర్యమ్
“ఆ ఉదయపు సమయము ప్రియులు/వల్లభులు తమ ఖండితనాయికల
కన్నీటిని తుడవవలసిన సమయము. అందుచేత, సూర్యుడి
మార్గము నుంచి తొలగి పొమ్ము. తామరల ముఖపద్మములనుంచి మంచు బిందువుల
కన్నీటిని తొలగించేందుకు తిరిగి వస్తున్న సమయంలో నీవు తన కిరణాలను అడ్డగిస్తే అతడు
ఎంతో కోపానికి లోనవుతాడు.”
Comments
Post a Comment