త్వన్నిష్యన్దోచ్ఛ్వసిత...


శ్లోకః
త్వన్నిష్యన్దోచ్ఛ్వసితవసుధాగన్ధసమ్పర్కరమ్యః
స్రోతోరన్ధ్రధ్వనితసుభగం దన్తిభిః పీయమానః ।
నీచైర్వాస్యత్యుపజిగమిషోర్దేవపూర్వం గిరిం తే
శీతో వాయుః పరిణమయితా కాననోదుమ్బరాణామ్ 1.45

పదవిభాగః
త్వత్ నిష్యన్ద-ఉచ్ఛ్వసిత-వసుధా-గన్ధ-సమ్పర్క-రమ్యః స్రోతః-రన్ధ్ర-ధ్వనిత-సుభగం దన్తిభిః పీయమానః । నీచైః వాస్యతి ఉపజిగమిషః దేవ-పూర్వం గిరిం తే శీతో వాయుః పరిణమయితా కానన-ఉదుమ్బరాణామ్ 1.45

అన్వయః
త్వత్-నిష్యన్దోచ్ఛ్వసితవసుధాగన్ధసమ్పర్కరమ్యః స్రోతోరన్ధ్రధ్వనితసుభగం దన్తిభిః పీయమానః కాననోదుమ్బరాణామ్ పరిణమయితా శీతో వాయుః దేవపూర్వం గిరిం ఉపజిగమిషః తే నీచైః వాస్యతి 1.45

ప్రతిపదార్థః
త్వత్-నిష్యన్దోచ్ఛ్వసితవసుధాగన్ధసమ్పర్కరమ్యః = నీనుంచి (కురిసిన) వానల వలన ఉబ్బిన భూమి యొక్క వాసనచేత మనస్సును ఆకట్టుకొనేది
స్రోతోరన్ధ్రధ్వనితసుభగం = ఘ్రాణేంద్రియమైన తొండముతో చేయబడిన శబ్దముచేత ప్రీతికరమైనది
దన్తిభిః = ఏనుగులచేత
పీయమానః = తాగబడుతున్నది
కాననోదుమ్బరాణామ్ పరిణమయితా = అడవులలోని మేడికాయలను పక్వం చేస్తునట్టి
శీతో వాయుః = చల్లని గాలి
దేవపూర్వం గిరిం = దేవగిరిని
ఉపజిగమిషః తే = చేరాలని కోరుతున్న నీకు
నీచైః = దిగువగా/నెమ్మదిగా
వాస్యతి = వీచనున్నది

తాత్పర్యమ్
వానలతో తడిసి ఉబ్బిన నేలల సువాసనను నింపుకొని ఉన్నది, ఏనుగులు తమ తొండాలతో ఆత్రంగా, శబ్దము చేస్తూ పీలుస్తూ ఉన్నది అయిన చల్లని గాలి మేడిచెట్ల పళ్ళను పక్వం చేస్తూ, దేవగిరి వైపుగా ప్రయాణిస్తున్న నీకు దిగువగా వీస్తుంది.”
(స్రోతః అన్నప్పుడు ఇక్కడ ఇంద్రియం అనే అర్థాన్ని స్వీకరించారు, చెవి అని కాకుండా)

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...