వీచిక్షోభస్తనిత...


శ్లోకః
వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాఞ్చీగుణాయాః
సంసర్పన్త్యాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః ।
నిర్విన్ధ్యాయాః పథి భవ రసాభ్యన్తరః సంనిపత్య
స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమో హి ప్రియేషు 1.29

పదవిభాగః
వీచి-క్షోభ-స్తనిత-విహగ-శ్రేణి-కాఞ్చీ-గుణాయాః సంసర్పన్త్యాః స్ఖలిత-సుభగం దర్శిత-ఆవర్త-నాభేః । నిర్విన్ధ్యాయాః పథి భవ రస-అభ్యన్తరః సన్నిపత్య స్త్రీణామ్ ఆద్యం ప్రణయ-వచనం విభ్రమః హి ప్రియేషు

అన్వయః
పథి వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాఞ్చీగుణాయాః స్ఖలితసుభగం సంసర్పన్త్యాః దర్శితావర్తనాభేః నిర్విన్ధ్యాయాః సన్నిపత్య రసాభ్యన్తరః భవ, ప్రియేషు విభ్రమః స్త్రీణామ్ ఆద్యం ప్రణయవచనం హి 1.29

ప్రతిపదార్థః
పథి = త్రోవలో
వీచిక్షోభ-స్తనిత-విహగశ్రేణి-కాఞ్చీ-గుణాయాః = కదులుతున్న తరంగాల చప్పుడుతో పక్షుల వరుసయే వడ్డాణముగా కలదైన
స్ఖలితసుభగం = అందముగా తడబడుతూ
సంసర్పన్త్యాః నిర్విన్ధ్యాయాః = ప్రవహిస్తున్న నిర్వింధ్య అనే నది యొక్క
దర్శితావర్తనాభేః = బొడ్డు వలె కనబడుతున్న సుడిగుండము కలదానియొక్క
సన్నిపత్య = సమీపమునకు వెళ్ళి
రసాభ్యన్తరః భవ = రసమును (జలమును) తీసికొనుము
ప్రియేషు = ప్రియులయందు
విభ్రమః = విలాసము
స్త్రీణామ్ = స్త్రీలకు
ఆద్యం ప్రణయవచనం హి = మొదటి ప్రణయసూచన కదా

తాత్పర్యమ్
“(ఉజ్జయినికి వెళ్ళే) దారిలో - పక్షుల వరుసను వడ్డాణముగా, అలల చప్పుడును ఆ వడ్డాణపు గలగలలుగా చేసుకొని (రాళ్ళపై) తడబడుతూ పారుతూ, బొడ్డు వలె ఉన్న నీటి సుడితో ఉన్న నిర్వింధ్యానదిని సమీపించి రసాస్వాదన చేయుము. కులుకుల ద్వారానే కదా పడతులు తమ వలపును మొదటగా సూచించేది!”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...