నీపం దృష్ట్వా


శ్లోకః
నీపం దృష్ట్వా హరితకపిశం కేసరైరర్ధరూఢైః
ఆవిర్భూతప్రథమముకులాః కన్దలీశ్చానుకచ్ఛమ్ ।
జగ్ధ్వారణ్యేష్వధికసురభిం గన్ధమాఘ్రాయ చోర్వ్యాః
సారఙ్గాస్తే జలలవముచః సూచయిష్యన్తి మార్గమ్ ॥1.21
  
పదవిభాగః
నీపం దృష్ట్వా హరిత-కపిశం కేసరైః అర్ధ-రూఢైః ఆవిర్భూత ప్రథమ-ముకులాః కన్దలీః చ అనుకచ్ఛమ్ । జగ్ధ్వా అరణ్యేషు అధిక-సురభిం గన్ధమ్ ఆఘ్రాయ చ ఉర్వ్యాః సారఙ్గాః తే జల-లవ-ముచః సూచయిష్యన్తి మార్గమ్ ॥

అన్వయః
సారఙ్గాః అర్ధరూఢైః కేసరైః హరితకపిశం నీపం దృష్ట్వా అనుకచ్ఛమ్ ఆవిర్భూతప్రథమముకులాః కన్దలీః జగ్ధ్వా అరణ్యేషు ఉర్వ్యాః అధికసురభిం గన్ధమ్ ఆఘ్రాయ చ జలలవముచః తే మార్గమ్ సూచయిష్యన్తి ॥
  
ప్రతిపదార్థః
అర్ధరూఢైః కేసరైః = సగము మొలచిన కేసరములతో (ఉన్న)
హరితకపిశం నీపం = ఆకుపచ్చ-ఎరుపు రంగులలోనున్న కడిమి చెట్టును
దృష్ట్వా = చూసి
అనుకచ్ఛమ్ = చిత్తడిగా ఉన్న నేలలను వెంబడి
ఆవిర్భూతప్రథమముకులాః కన్దలీః = మొలచిన మొదటి మొగ్గలు గల నేల అరటి తీగలను
జగ్ధ్వా = తిని
అరణ్యేషు = అడవులలోని
అధికసురభిం ఉర్వ్యాః గన్ధమ్ = అధికమైన పరిమళము గల భూమియొక్క వాసనను
ఆఘ్రాయ చ = పీల్చుకొని
జలలవముచః తే = కొద్దిపాటి నీటిని (తుంపరను) వదులుతున్న నీ యొక్క
మార్గమ్ సూచయిష్యన్తి = తోవను సూచిస్తాయి

తాత్పర్యమ్
ఇంకా పూర్తిగా ఎదగని కేసరములతో ఆకుపచ్చ, ఇటుక రంగులతో ఉన్న కడిమి చెట్టును చూసి, తొలి మొగ్గలు మొలుస్తున్న నేల అరటి తీగలను తిని, తడిసిన మట్టి పరిమళాన్ని వాసన చూసిలేళ్ళు నీటి తుంపరలను చల్లుతూ వెళుతున్న నీ మార్గాన్ని సూచిస్తాయి
(సారంగశబ్దానికి తుమ్మెదలు, లేళ్ళు, చాతకపక్షులు, ఏనుగులు అని నాలుగు అర్థాలున్నాయి. మల్లినాథుడు తన వ్యాఖ్యలో తుమ్మెదలను, లేళ్ళను, ఏనుగులను పట్టుకున్నాడు. నీపవృక్షాల కేసరాలు, నేల అరటి తీగల మొగ్గలు, తడిసిన మట్టి వాసన క్రమంగా తుమ్మెదలను, లేళ్ళను, ఏనుగులను ఆకట్టుకుంటాయి. ఆ రంగులు, రుచులు, వాసనలు, వాటిని ఇష్టపడే జంతుజాలమువర్షర్తుసంరభాన్ని సూచిస్తాయి.)

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...