విశ్రాన్తః సన్ వ్రజ


శ్లోకః
విశ్రాన్తః సన్ వ్రజ వననదీతీరజానాం నిషిఞ్చన్
ఉద్యానానాం నవజలకణైర్యూథికాజాలకాని ।
గణ్డస్వేదాపనయనరుజాక్లాన్తకర్ణోత్పలానాం
ఛాయాదానాత్ క్షణపరిచితః పుష్పలావీముఖానామ్ 1.27

పదవిభాగః
విశ్రాన్తః సన్ వ్రజ వన-నదీతీరజానాం నిషిఞ్చన్ ఉద్యానానాం నవజలకణైః యూథికా-జాలకాని గణ్డ-స్వేద-అపనయన-రుజా-క్లాన్త-కర్ణోత్పలానాం ఛాయా-దానాత్ క్షణ-పరిచితః పుష్పలావీ-ముఖానామ్

అన్వయః
విశ్రాన్తః సన్, వననదీతీరజానాం ఉద్యానానాం యూథికాజాలకాని నవజలకణైః నిషిఞ్చన్ గణ్డస్వేదాపనయనరుజాక్లాన్తకర్ణోత్పలానాం పుష్పలావీముఖానామ్ ఛాయాదానాత్ క్షణపరిచితః (భూత్వా) వ్రజ 1.27

ప్రతిపదార్థః
విశ్రాన్తః సన్ = విశ్రమించినవాడవై
వననదీతీరజానాం ఉద్యానానాం = అడవి నదుల తీరములలో మొలచిన తోటల యొక్క
యూథికాజాలకాని = అడవి మొల్లలను
నవజలకణైః = నిర్మలమైన నీటి చుక్కలతో
నిషిఞ్చన్ = తడుపుతూ
గణ్డ-స్వేద-అపనయన-రుజా-క్లాన్త-కర్ణోత్పలానాం పుష్పలావీ-ముఖానామ్ = చెక్కిళ్ళపై చెమటను తుడుచుకోవడంతో వాడిన కలువలు చెవులలో ఉన్న పూలు అమ్మే పడుచుల ముఖములకు
ఛాయాదానాత్ = నీడనివ్వటం వలన
క్షణపరిచితః (భూత్వా) = క్షణము సేపు పరిచయం చేసుకున్న వాడవై
వ్రజ = వెళ్ళుము

తాత్పర్యమ్
“(నీచై పర్వతముపై) విశ్రాంతి తీసుకున్నాక, అడవులలో నదుల తీరాలపై వాటంతకవే పెరుగుతూ ఉన్న తోటలలోని అడవి మొల్లలపై శుభ్రజలాలను చిలకరిస్తూ, అక్కడ పూలు కోస్తూ, చెక్కిళ్ళపై చెమటలను తుడుచుకోవడం వలన చెవులలో అలంకరించుకున్న కలువలు వాడి ఉన్న పుష్పలావికల ముఖాలకు నీడనిచ్చి, క్షణపరిచితుడవై సాగిపొమ్ము.”
("తీరజాతాని సిఞ్చన్" అని పాఠాంతరము)

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...