ఛన్నోపాన్తః
శ్లోకః
ఛన్నోపాన్తః పరిణతఫలద్యోతిభిః కాననామ్రైః
త్వయ్యారూఢే శిఖరమచలః స్నిగ్ధవేణీసవర్ణే ।
నూనం యాస్యత్యమరమిథునప్రేక్షణీయామవస్థామ్
మధ్యే శ్యామః స్తన ఇవ భువః శేషవిస్తారపాణ్డుః ॥1.18॥
పదవిభాగః
ఛన్న-ఉపాన్తః పరిణత-ఫల-ద్యోతిభిః
కానన-ఆమ్రైః త్వయి ఆరూఢే శిఖరమ్ అచలః స్నిగ్ధ-వేణీ-సవర్ణే । నూనం యాస్యతి అమర-మిథున-ప్రేక్షణీయామ్ అవస్థామ్ మధ్యే శ్యామః
స్తన ఇవ భువః శేష-విస్తార-పాణ్డుః ॥
అన్వయః
స్నిగ్ధవేణీసవర్ణే త్వయి శిఖరమ్ ఆరూఢే (సతి) పరిణతఫలద్యోతిభిః కాననామ్రైః ఛన్నోపాన్తః అచలః మధ్యే శ్యామః
శేషవిస్తారపాణ్డుః (సన్) భువః స్తనః ఇవ
అమరమిథునప్రేక్షణీయామ్ అవస్థామ్ నూనం యాస్యతి ॥
ప్రతిపదార్థః
స్నిగ్ధవేణీసవర్ణే త్వయి శిఖరమ్ ఆరూఢే (సతి) = నల్లని కొప్పు వలె ఉన్న నీవు శిఖరము పై ఉన్నప్పుడు
పరిణతఫలద్యోతిభిః కాననామ్రైః = పండిన మామిడిపళ్ళకాంతులతోనున్న
మామిడి చెట్ల అడవులతో
ఛన్నోపాన్తః అచలః = పక్క భాగములు కప్పబడి ఉన్న పర్వతము
మధ్యే శ్యామః శేషవిస్తారపాణ్డుః (సన్)= మధ్యలో నల్లగా, మిగతాభాగమంతా తెలుపు వ్యాపించినదై
భువః స్తనః ఇవ = భూమి యొక్క స్తనము వలె
అమరమిథునప్రేక్షణీయామ్ = దేవతల జంటలచే చూడదగిన
అవస్థామ్ = స్థితిని
నూనం యాస్యతి = తప్పక పొందును
తాత్పర్యమ్
“స్త్రీల కొప్పు వలె నల్లగా ఉన్న నీవు ఆమ్రకూటశిఖరమును
అధిరోహించి ఉన్నప్పుడు, పల్లపు ప్రాంతాలలో పచ్చగా పండిన మామిడి
చెట్ల అడవులతో ఉన్న ఆ కొండను ఆకాశములోనున్న దేవతల జంటలు చూసినప్పుడు –పరచుకున్న తెలుపు నడుమన కొద్దిపాటి నలుపుతో– భూమియొక్క
స్తనము వలె కనబడుతుంది.”
Comments
Post a Comment