తస్యాస్తిక్తైర్వనగజమదైర్వాసితం
శ్లోకః
తస్యాస్తిక్తైర్వనగజమదైర్వాసితం వాన్తవృష్టిః
జమ్బూకుఞ్జప్రతిహతరయం తోయమాదాయ గచ్ఛేః ।
అన్తఃసారం ఘన తులయితుం నానిలః శక్ష్యతి త్వాం
రిక్తః సర్వో భవతి హి లఘుః పూర్ణతా గౌరవాయ ॥1.20॥
పదవిభాగః
తస్యాః తిక్తైః వన-గజ-మదైః వాసితం వాన్త-వృష్టిః జమ్బూ-కుఞ్జ-ప్రతిహత-రయం తోయమ్ ఆదాయ గచ్ఛేః । అన్తః-సారం ఘన
తులయితుం న అనిలః శక్ష్యతి త్వాం రిక్తః సర్వః భవతి హి లఘుః పూర్ణతా
గౌరవాయ ॥
అన్వయః
వాన్తవృష్టిః (సన్) తిక్తైః వనగజమదైః
వాసితం జమ్బూకుఞ్జప్రతిహతరయం తస్యాః తోయమ్ ఆదాయ గచ్ఛేః ఘన,
అన్తఃసారం త్వాం అనిలః తులయితుం
న శక్ష్యతి రిక్తః సర్వః లఘుః భవతి హి పూర్ణతా గౌరవాయ (భవతి) ॥
ప్రతిపదార్థః
వాన్తవృష్టిః (సన్) = వర్షరూపములో వాంతి
చేసుకున్న వాడవై
తిక్తైః వనగజమదైః వాసితం = ఘాటుగా ఉండే అడవి ఏనుగుల ఘాటైన మదపు
వాసనలను కలిగినది
జమ్బూకుఞ్జప్రతిహతరయం = నేరేడు తోపుల చేత అడ్డగించబడిన వేగము కలది
(అయిన)
తస్యాః = ఆ నర్మదానది యొక్క
తోయమ్ = నీటిని
ఆదాయ = తీసుకొని
గచ్ఛేః = వెళ్ళుము
ఘన = ఓ మేఘుడా
అన్తఃసారం త్వాం = లోపల సత్తువ గలిగిన వాడివైన నిన్ను
అనిలః = (ఆకాశము లోని) వాయువు
తులయితుం న శక్ష్యతి = త్రోయలేడు
రిక్తః సర్వః = లోపల సారము లేనిది అంతా
లఘుః భవతి = చులకన అవుతుంది
పూర్ణతా గౌరవాయ (భవతి) హి = నిండుదనము గౌరవపాత్రమవుతుంది కదా
తాత్పర్యమ్
“(ఆమ్రకూటముపై) నీలో
ఉన్న నీటిని వర్షరూపంలో కక్కి వేసాక, నర్మదానదిలోని ఏనుగుల మదజలముతో
ఘాటెక్కినదీ, నేరేడు తోపుల కారణంగా వేగాన్ని కోల్పోయినదీ అయిన
నర్మదానదీజలాలను స్వీకరించు. అంతస్సారమును కలిగి ఉన్న నిన్ను
వాయువు తోయజాలదు. సారహీనత చులకనకు, నిండుదనము
గౌరవానికి అర్హమవుతాయి కదా.”
Comments
Post a Comment