అమ్భోబిన్దుగ్రహణచతురాన్


శ్లోకః
అమ్భోబిన్దుగ్రహణచతురాంశ్చాతకాన్ వీక్షమాణాః
శ్రేణీభూతాః పరిగణనయా నిర్దిశన్తో బలాకాః ।
త్వామాసాద్య స్తనితసమయే మానయిష్యన్తి సిద్ధాః
సోత్కమ్పాని ప్రియసహచరీసమ్భ్రమాలిఙ్గితాని ॥1.22

పదవిభాగః
అమ్భః-బిన్దు-గ్రహణ-చతురాన్ చాతకాన్ వీక్షమాణాః శ్రేణీ-భూతాః పరిగణనయా నిర్దిశన్తః బలాకాః । త్వామ్ ఆసాద్య స్తనిత-సమయే మానయిష్యన్తి సిద్ధాః స-ఉత్కమ్పాని ప్రియ-సహచరీ-సమ్భ్రమ-ఆలిఙ్గితాని

అన్వయః
అమ్భోబిన్దుగ్రహణచతురాన్ చాతకాన్ వీక్షమాణాః శ్రేణీభూతాః బలాకాః పరిగణనయా నిర్దిశన్తః సిద్ధాః స్తనితసమయే సోత్కమ్పాని ప్రియసహచరీసమ్భ్రమాలిఙ్గితాని ఆసాద్య త్వాం మానయిష్యన్తి ॥

ప్రతిపదార్థః
అమ్భోబిన్దుగ్రహణచతురాన్ చాతకాన్ = నీటి చుక్కలను పట్టుకోవడంలో నేర్పరులైన వానకోయిలలను
వీక్షమాణాః = చూస్తున్నవారు
శ్రేణీభూతాః బలాకాః = బారు తీరిన బెగ్గురుపక్షులను
పరిగణనయా నిర్దిశన్తః సిద్ధాః = లెక్కపెడుతూ చూపిస్తూ ఉన్న సిద్ధజాతి పురుషులు
స్తనితసమయే = ఉరుము ఉరిమినప్పుడు
సోత్కమ్పాని ప్రియసహచరీసమ్భ్రమాలిఙ్గితాని = ఉలికిపాటుతో, ఉద్వేగముతో కూడుకున్న ప్రియురాండ్ల కౌగిలింతలను
ఆసాద్య = పొంది
త్వాం మానయిష్యన్తి = నిన్ను గౌరవించనున్నారు

తాత్పర్యమ్
వానచినుకులను నేల రాలకముందే ఒడుపుగా పట్టుకుంటున్న వానకోయిలలను చూస్తూ, వరుస కట్టిన బెగ్గురుపక్షులను లెక్క పెడుతూ తమ ప్రియురాండ్రకు చూపిస్తూ ఉన్న సిద్ధజాతి పురుషులు, నీవు చేసే ఉరుము చప్పుడును విన్న ఆ ప్రియురాండ్రు ఉలికిపడి కలవరముతో తమను కౌగిలించుకోగా – (మనస్సులోనే) నీకు కృతజ్ఞతలను తెలుపుకుంటారు.”
(సోత్కమ్పాని బదులు సోత్కంఠాని అని పాఠాంతరము; బలాకాః -        ద్వితీయావిభక్తిలో ప్రయోగించారు కనుక - ఆడు కొంగలు అయి ఉండాలి...)

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...