వక్రః పన్థా యదపి
శ్లోకః
వక్రః పన్థా యదపి భవతః ప్రస్థితస్యోత్తరాశాం
సౌధోత్సఙ్గప్రణయవిముఖో మా స్మ భూరుజ్జయిన్యాః ।
విద్యుద్దామస్ఫురితచకితైస్తత్ర పౌరాఙ్గనానాం
లోలాపాఙ్గైర్యది న రమసే లోచనైర్వఞ్చితోఽసి ॥1.28॥
పదవిభాగః
వక్రః పన్థా యత్ అపి భవతః ప్రస్థితస్య ఉత్తర-ఆశాం సౌధ-ఉత్సఙ్గ-ప్రణయ-విముఖః మా స్మ భూః
ఉజ్జయిన్యాః । విద్యుత్-దామ-స్ఫురిత-చకితైః తత్ర పౌర-అఙ్గనానాం లోలాపాఙ్గైః యది న రమసే
లోచనైః వఞ్చితః అసి ॥
అన్వయః
ఉత్తరాశాం ప్రస్థితస్య
భవతః వక్రః పన్థా యదపి ఉజ్జయిన్యాః సౌధోత్సఙ్గప్రణయవిముఖః మా స్మ భూః తత్ర పౌరాఙ్గనానాం విద్యుద్దామస్ఫురితచకితైః లోలాపాఙ్గైః లోచనైః యది న రమసే వఞ్చితః
అసి ॥
ప్రతిపదార్థః
ఉత్తరాశాం ప్రస్థితస్య
భవతః = ఉత్తరదిశకు బయలుదేరిన నీకు
వక్రః పన్థా = చుట్టూ తిరిగిన తోవ
యదపి = అయినప్పటికీ
ఉజ్జయిన్యాః = ఉజ్జయిని యొక్క
సౌధోత్సఙ్గప్రణయవిముఖః మా స్మ భూః = మేడల వసారాల పరియము కలుగనివాడవు
కావద్దు సుమా
తత్ర = అక్కడ
విద్యుద్దామస్ఫురితచకితైః లోలాపాఙ్గైః పౌరాఙ్గనానాం లోచనైః = మెరుపుల తళతళతో చంచలమైన కనులకొసలను కలిగిన ఆ పురవనితల కళ్ళతో
యది న రమసే = వినోదించకపోయినచో
వఞ్చితః అసి = మోసపోయినవాడవవుతావు
తాత్పర్యమ్
“ఉత్తరదిశగా బయలుదేరిన నీ
తోవలో లేనప్పటికీ ఉజ్జయినీ నగరానికి వెళ్ళి అక్కడి మేడ వసారాలతో పరిచయం చేసుకోవాలి
సుమా! మెరుపుల తళతళలతో చంచలమైన క్రీగంటి చూపులు గల ఆ నగరసుందరుల
కన్నులను చూచి వినోదించకపోతే మోసపోయినవాడవవుతావు.”
(వంచితోసి = నీ జన్మ నిష్ఫలము అవుతుంది – మల్లినాథుడి వ్యాఖ్య)
Comments
Post a Comment