తేషాం దిక్షు ప్రథితవిదిశాలక్షణాం
శ్లోకః
తేషాం దిక్షు ప్రథితవిదిశాలక్షణాం రాజధానీం
గత్వా సద్యః ఫలమవికలం కాముకత్వస్య లబ్ధా ।
తీరోపాన్తస్తనితసుభగం పాస్యసి స్వాదు యస్మాత్
సభ్రూభఙ్గం ముఖమివ పయో వేత్రవత్యాశ్చలోర్మి ॥1.25॥
పదవిభాగః
తేషాం దిక్షు ప్రథిత-విదిశా-లక్షణాం
రాజధానీం గత్వా సద్యః ఫలమ్ అవికలం కాముకత్వస్య లబ్ధా । తీరోపాన్త-స్తనిత-సుభగం పాస్యసి
స్వాదు యస్మాత్ స-భ్రూ-భఙ్గం ముఖమ్ ఇవ
పయో వేత్రవత్యాః చలోర్మి ॥1.25॥
అన్వయః
తేషాం విదిశాలక్షణాం దిక్షు ప్రథితరాజధానీం గత్వా సద్యః కాముకత్వస్య
ఫలమ్ అవికలం లబ్ధా యస్మాత్ చలోర్మి వేత్రవత్యాః స్వాదు పయః సభ్రూభఙ్గం ముఖమ్ ఇవ
తీరోపాన్తస్తనితసుభగం పాస్యసి ॥1.25॥
ప్రతిపదార్థః
తేషాం = వాటి యొక్క (దశార్ణముల యొక్క)
విదిశాలక్షణాం = విదిశ అని పేరు గల
దిక్షు = దిక్కులందు
ప్రథితరాజధానీం గత్వా = ప్రఖ్యాతమైన రాజధానికి వెళ్ళి
సద్యః = వెంటనే
కాముకత్వస్య ఫలమ్ = రసికత్వమునకు ఫలితమును
అవికలం = సంపూర్ణముగా
లబ్ధా = పొందుతావు
యస్మాత్ = ఎలాగంటే
చలోర్మి వేత్రవత్యాః = కదిలే అలలు గల వేత్రావతి నది యొక్క
స్వాదు పయః = రుచికరమైన నీటిని
సభ్రూభఙ్గం ముఖమ్ ఇవ = భ్రుకుటి ముడివేసిన ముఖము వలె
తీరోపాన్తస్తనితసుభగం = తీరానికి సమీపంగా చప్పుడు చేస్తూ
పాస్యసి = తాగనున్నావు
తాత్పర్యమ్
“విదిశ అని అన్ని దిక్కులా పేరుగాంచినదైన ఆ దశార్ణజనపదాల రాజధాని
నగరమునకు వెళ్ళి నీ రసికతకు పూర్తి స్థాయి ఫలాన్ని పొందుతావు. ఎలాగంటే – అక్కడ చిరు తరగల వేత్రావతీ నది యొక్క రుచికరమైన
జలాలను - తీరానికి దగ్గరగా వెళ్ళి, శబ్దం
చేస్తూ – కనుబొమలు ముడి వేసిన ప్రేయసి ముఖాన్ని గ్రోలినట్లు గ్రోలనున్నావు.”
(యస్మాత్ బదులుగా యత్తత్ అని పాఠాంతరము)
Comments
Post a Comment