నీచైరాఖ్యం గిరిమధివసేః
శ్లోకః
నీచైరాఖ్యం గిరిమధివసేస్తత్ర విశ్రామహేతోః
త్వత్సమ్పర్కాత్ పులకితమివ ప్రౌఢపుష్పైః కదమ్బైః ।
యః పుణ్యస్త్రీరతిపరిమలోద్గారిభిర్నాగరాణామ్
ఉద్దామాని ప్రథయతి శిలావేశ్మభిర్యౌవనాని ॥1.26॥
పదవిభాగః
నీచైః ఆఖ్యం గిరిమ్ అధివసేః తత్ర విశ్రామ-హేతోః త్వత్ సమ్పర్కాత్
పులకితమ్ ఇవ ప్రౌఢ-పుష్పైః కదమ్బైః । యః పణ్య-స్త్రీ-రతి-పరిమల-ఉద్గారిభిః నాగరాణామ్ ఉద్దామాని ప్రథయతి శిలావేశ్మభిః యౌవనాని ॥
అన్వయః
తత్ర విశ్రామహేతోః ప్రౌఢపుష్పైః కదమ్బైః త్వత్ సమ్పర్కాత్ పులకితమ్ ఇవ నీచైరాఖ్యం
గిరిమ్ అధివసేః యః పణ్యస్త్రీ-రతిపరిమలోద్గారిభిః శిలావేశ్మభిః నాగరాణామ్
ఉద్దామాని యౌవనాని ప్రథయతి ॥
ప్రతిపదార్థః
తత్ర = అక్కడ (ఆ విదిశ సమీపంలో)
విశ్రామహేతోః = విశ్రాంతి కోసమై
ప్రౌఢపుష్పైః కదమ్బైః = బాగా వికసించిన కదంబపుష్పాలతో
త్వత్ సమ్పర్కాత్ = నీ సాహచర్యములో
పులకితమ్ ఇవ నీచైరాఖ్యం గిరిమ్ = పులకించినట్లున్న నీచై
అనే పేరు గల కొండను
అధివసేః = నివసించుము
యః = ఏదైతే
పణ్యస్త్రీరతిపరిమలోద్గారిభిః శిలావేశ్మభిః = వేశ్యల రతిపరిమళమును
వెలువరుస్తున్న గుహలతో
నాగరాణామ్ = (విదిశా) నగరప్రజల
ఉద్దామాని యౌవనాని = గొప్పవైన/విశృంఖలమైన యౌవనాలను
ప్రథయతి = ప్రకటిస్తుందో
తాత్పర్యమ్
“ఆ విదిశానగరపు సమీపాన – బాగా వికసించిన కడిమి
పూలతో నీ స్పర్శకు పులకించినట్లున్నదీ, గుహల నుంచి వెలువడే వేశ్యాసంగమపరిమళాలతో
ఆ నగరపు ప్రజల యౌవనోల్బణాన్ని చాటిచెబుతున్నదీ అయిన నీచై అనే కొండపై విశ్రాంతి కోసం
ఆగుము.”
Comments
Post a Comment