త్వామాసారప్రశమితవనోపప్లవం


శ్లోకః
త్వామాసారప్రశమితవనోపప్లవం సాధు మూర్ధ్నా
వక్ష్యత్యధ్వశ్రమపరిగతం సానుమానామ్రకూటః ।
న క్షుద్రోఽపి ప్రథమసుకృతాపేక్షయా సంశ్రయాయ
ప్రాప్తే మిత్రే భవతి విముఖః కిం పునర్యస్తథోచ్చైః॥1.17

పదవిభాగః
త్వామ్ ఆసార-ప్రశమిత-వన-ఉపప్లవం సాధు మూర్ధ్నా వక్ష్యతి అధ్వ-శ్రమ-పరిగతం సానుమాన్ ఆమ్రకూటః । న క్షుద్రః అపి ప్రథమ-సుకృత-అపేక్షయా సంశ్రయాయ ప్రాప్తే మిత్రే భవతి విముఖః కిం పునః యః తథా ఉచ్చైః

అన్వయః
ఆమ్రకూటః సానుమాన్ ఆసారప్రశమితవనోపప్లవం అధ్వశ్రమపరిగతం త్వామ్ సాధు మూర్ధ్నా వక్ష్యతి క్షుద్ర అపి ప్రథమసుకృతాపేక్షయా సంశ్రయాయ ప్రాప్తే మిత్రే విముఖః న భవతి, యః తథా ఉచ్చైః కిం పునః

ప్రతిపదార్థః
ఆమ్రకూటః సానుమాన్ = ఆమ్రకూటపర్వతము
ఆసారప్రశమితవనోపప్లవం అధ్వశ్రమపరిగతం త్వామ్ = వానతో కార్చిచ్చును ఆర్పినవాడివి ప్రయాణముతో అలసినవాడివి అయిన నిన్ను
సాధు = బాగా
మూర్ధ్నా = శిరస్సుతో
వక్ష్యతి = మోయనున్నాడు
క్షుద్రః అపి = నీచుడు కూడా
ప్రథమసుకృతాపేక్షయా = తొలుత పొందిన ఉపకారము చేత
సంశ్రయాయ = ఆశ్రయము కొరకు
ప్రాప్తే మిత్రే = మిత్రుడు వచ్చినప్పుడు
విముఖః న భవతి = పెడమొగము పెట్టడు
యః తథా ఉచ్చైః = ఎవడు అంత ఎత్తున ఉంటాడో
కిం పునః = (వాడి గురించి) మళ్ళీ ఎందుకు (చెప్పడం)?

తాత్పర్యమ్
“(ఇతఃపూర్వము గ్రీష్మర్తువులలో తన పైన పెరిగిన) అడవులలో చెలరేగిన దావానలాన్ని వర్షపుధారలతో ఉపశమింపజేసినట్టి వాడవు, (ఇప్పుడు) మార్గాయాసముతో ఉన్నవాడవూ అయిన నిన్ను ఆమ్రకూటపర్వతము తన తలపై మోయనున్నది. గతములో ఉపకారమును చేసినవాడు ఆశ్రయమును కోరి వస్తే, నీచులు సైతము నిరాకరించరు, (ఆమ్రకూటము వలె) ఉన్నతుల గురించి, వేరే చెప్పాలా?”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...