ఉత్పశ్యామి ద్రుతమపి
శ్లోకః
ఉత్పశ్యామి ద్రుతమపి సఖే మత్ప్రియార్థం యియాసోః
కాలక్షేపం కకుభసురభౌ పర్వతే పర్వేతే తే ।
శుక్లాపాఙ్గైః సజలనయనైః స్వాగతీకృత్య కేకాః
ప్రత్యుద్యాతః కథమపి భవాన్ గన్తుమాశు వ్యవస్యేత్ ॥1.23॥
పదవిభాగః
ఉత్పశ్యామి ద్రుతమ్ అపి సఖే మత్-ప్రియ-అర్థం యియాసోః కాలక్షేపం కకుభ-సురభౌ పర్వతే పర్వేతే
తే । శుక్ల-అపాఙ్గైః సజల-నయనైః
స్వాగతీకృత్య కేకాః ప్రత్యుద్యాతః కథమ్ అపి భవాన్ గన్తుమ్ ఆశు వ్యవస్యేత్ ॥
అన్వయః
సఖే, మత్ప్రియార్థం ద్రుతం యియాసోః అపి తే కకుభసురభౌ
పర్వతే పర్వేతే కాలక్షేపం ఉత్పశ్యామి । శుక్లాపాఙ్గైః సజలనయనైః కేకాః స్వాగతీకృత్య
ప్రత్యుద్యాతః (సన్) భవాన్ కథమ్ అపి ఆశు
గన్తుం వ్యవస్యేత్ ॥
ప్రతిపదార్థః
సఖే = మిత్రమా
మత్ప్రియార్థం = నాకు ప్రియమును కలిగించుటకు
ద్రుతం = త్వరగా
యియాసోః అపి తే = వెళ్ళాలని కోరికతో ఉన్నప్పటికీ నీకు
కకుభసురభౌ పర్వతే పర్వేతే = కొండమల్లెల వాసనలతో నిండిన పర్వతాలలో
కాలక్షేపం = ఆలస్యమును
ఉత్పశ్యామి = ఊహించగలుగుతున్నాను
సజలనయనైః శుక్లాపాఙ్గైః = తడి కన్నుల నెమళ్ళ చేత
కేకాః = క్రేంకారములను
స్వాగతీకృత్య = స్వాగతముగా చేసుకొని
ప్రత్యుద్యాతః (సన్) = ఎదుర్కొనబడినవాడవై
భవాన్ = నీవు
కథమపి = ఎలాగైనా
ఆశు = వేగంగా
గన్తుం = వెళ్ళుటకు
వ్యవస్యేత్ = ప్రయత్నింతువు గాక
తాత్పర్యమ్
“ఓ మిత్రమా, నాకు ప్రియమును చేకూర్చేందుకు నీవు తొందరగా
వెళ్ళాలని అనుకున్నప్పటికీ, కొండమల్లెల పరిమళాల పర్వతాలపై నీకు
ఆలస్యం కానున్నదనే ఊహిస్తున్నాను. తడి కన్నుల నెమళ్ళు తమ క్రేంకారాలను
స్వాగతగీతాలుగా చేసి నీకు ఎదుర్కోలునిస్తాయి. ఏదో ఒక ప్రయత్నం
చేసి వీలైనంత తొందరగా అక్కడినుంచి బయలుదేరాలి, నీవు.”
(శుక్లాపాంగము = తెల్లని కడకన్నులు కలది
– నెమలి)
Comments
Post a Comment