పాణ్డుచ్ఛాయోపవనవృతయః


శ్లోకః
పాణ్డుచ్ఛాయోపవనవృతయః కేతకైః సూచిభిన్నైః
నీడారమ్భైర్గృహబలిభుజామాకులగ్రామచైత్యాః ।
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామజమ్బూవనాన్తాః
సమ్పత్స్యన్తే కతిపయదినస్థాయిహంసా దశార్ణాః 1.24

పదవిభాగః
పాణ్డుః-ఛాయా ఉపవన-వృతయః కేతకైః సూచిభిన్నైః నీడా-ఆరమ్భైః గృహ-బలిభుజామ్ ఆకుల-గ్రామ-చైత్యాః । త్వయి ఆసన్నే పరిణత-ఫల-శ్యామ-జమ్బూ-వన-అన్తాః సమ్పత్స్యన్తే కతిపయ-దిన-స్థాయి-హంసా దశార్ణాః

అన్వయః
త్వయి ఆసన్నే (సతి) దశార్ణాః సూచిభిన్నైః కేతకైః పాణ్డుచ్ఛాయోపవనవృతయః గృహబలిభుజామ్ నీడారమ్భైః ఆకులగ్రామచైత్యాః పరిణతఫలశ్యామజమ్బూవనాన్తాః దశార్ణాః కతిపయదినస్థాయిహంసాః సమ్పత్స్యన్తే

ప్రతిపదార్థః
త్వయి ఆసన్నే (సతి) = నీవు రాబోవు సమయములో
దశార్ణాః = దశార్ణములు అని పిలవబడే జనపదములు
సూచిభిన్నైః కేతకైః = వికసించిన మొగలిపూవులతో
పాణ్డుచ్ఛాయోపవనవృతయః = తెల్లరంగులోనున్న తోటల కంచెలు ఉన్నవి
గృహబలిభుజామ్ = కాకుల
నీడారమ్భైః = గూళ్ళు కట్టుకోవటము చేత
ఆకులగ్రామచైత్యాః = సంరభముతో ఉన్న మందిరాలు కలవి
పరిణతఫలశ్యామజమ్బూవనాన్తాః =బాగా పండి నలుపెక్కిన నేరేడు తోటలు అంచులలో ఉన్నవి
కతిపయదినస్థాయిహంసాః = కొన్ని రోజుల పాటు హంసలకు నివాసములు
సమ్పత్స్యన్తే = కానున్నవి

తాత్పర్యమ్
నీవు రాబోయే సమయంలో దశార్ణజనపదాలలో మొగలి పూలు వికసించి పొలముల కంచెలు తెల్లబారుతాయి. కాకులు గూళ్ళు కట్టుకోవడం మొదలై ఊళ్ళలోని చైత్యాలు, మందిరాలు సందడిగా ఉంటాయి. బాగా పండెక్కిన పళ్ళతో ఊరవతలి నేరేడు తోటలు నల్లబడతాయి. కొన్నాళ్ళపాటు ఆ ప్రాంతంలో హంసలు విడిది చేస్తాయి.”
(చైత్యము = బౌద్ధాలయము, మందిరము; దశార్ణ = దశ+ఋణఋణశబ్దానికి దుర్గం అనే అర్థం ఉన్నది; పది దుర్గాల ప్రాంతం, ఇప్పటి ఛత్తీస్ గఢ్ అంటారు)

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...