స్థిత్వా తస్మిన్ వనచరవధూభుక్తకుఞ్జే


శ్లోకః
స్థిత్వా తస్మిన్ వనచరవధూభుక్తకుఞ్జే ముహూర్తమ్
తోయోత్సర్గద్రుతతరగతిస్తత్పరం వర్త్మ తీర్ణః ।
రేవాం ద్రక్ష్యస్యుపలవిషమే విన్ధ్యపాదే విశీర్ణాం
భక్తిచ్ఛేదైరివ విరచితాం భూతిమఙ్గే గజస్య 1.19

పదవిభాగః
స్థిత్వా తస్మిన్ వనచర-వధూ-భుక్త-కుఞ్జే ముహూర్తమ్ తోయ-ఉత్సర్గ-ద్రుతతరగతిః తత్-పరం వర్త్మ తీర్ణః । రేవాం ద్రక్ష్యసి ఉపల-విషమే విన్ధ్య-పాదే విశీర్ణాం భక్తిః-ఛేదైః ఇవ విరచితాం భూతిమ్ అఙ్గే గజస్య

అన్వయః
తస్మిన్ వనచరవధూభుక్తకుఞ్జే ముహూర్తమ్ స్థిత్వా తోయోత్సర్గద్రుతతరగతిః (సన్) తత్పరం వర్త్మ తీర్ణః ఉపలవిషమే విన్ధ్యపాదే విశీర్ణాం గజస్య అఙ్గే భక్తిఛేచ్ఛేదైః విరచితాం భూతిం ఇవ రేవాం ద్రక్ష్యసి

ప్రతిపదార్థః
తస్మిన్ వనచరవధూభుక్తకుఞ్జే = ఆటవికవనితలచేత అనుభవించబడిన పొదరిండ్లలో
ముహూర్తమ్ స్థిత్వా = క్షణము పాటు నిలిచి
తోయోత్సర్గద్రుతతరగతిః (సన్) = నీటిని వదిలినందున వేగము పెరిగినవాడవై
తత్పరం = ఆ తరువాత
వర్త్మ తీర్ణః = మార్గమును దాటినవాడవై
ఉపలవిషమే విన్ధ్యపాదే = ఎగుడుదిగుడు రాళ్ళతోనున్న వింధ్యపర్వతపాదమందు
విశీర్ణాం = చిందరవందరలై ఉన్నదానిని
గజస్య అఙ్గే = ఏనుగు శరీరముపై
భక్తిచ్ఛేదైః విరచితాం భూతిం ఇవ= వివిధమైన  ఆకృతులలో రేఖలను చిత్రించినట్లున్న విలాసమును
రేవాం = నర్మదానదిని
ద్రక్ష్యసి = చూడనున్నావు

తాత్పర్యమ్
వనచరస్త్రీల విహారస్థానాలైన పొదరిండ్లలో క్షణకాలము నిలిచి, వర్షించి తేలికపడినందున వేగమును పెంచుకొని ఆమ్రకూటపర్వతము తరువాత వచ్చే దారిని కడచి, ఎగుడుదిగుడురాళ్ళ వింధ్యపర్వతపాదములో, చీదరవందరలై పారుతూ, ఏనుగు ఒంటి మీద వివిధాకృతులలలో గీతలను చిత్రించినట్లున్న నర్మదానదిని చూస్తావు.”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...