ప్రత్యాసన్నే నభసి


శ్లోకః

ప్రత్యాసన్నే నభసి దయితాజీవితాలమ్బనార్థీ
జీమూతేన స్వకుశలమయీం హారయిష్యన్ప్రవృత్తిమ్ ।
స ప్రత్యగ్రైః కుటజకుసుమైః కల్పితార్ఘాయ తస్మై
ప్రీతః ప్రీతిప్రముఖవచనం స్వాగతం వ్యాజహార ॥1.4


పదవిభాగః

ప్రత్యాసన్నే నభసి దయితా-జీవిత-ఆలమ్బనా-అర్థీ జీమూతేన స్వ-కుశలమయీం హారయిష్యన్ ప్రవృత్తిమ్ సః ప్రత్యగ్రైః కుటజ-కుసుమైః కల్పిత-అర్ఘాయ తస్మై ప్రీతః ప్రీతి-ప్రముఖ-వచనం స్వాగతం వ్యాజహార 


అన్వయః

ప్రత్యాసన్నే నభసి దయితాజీవితాలమ్బనార్థీ సః జీమూతేన స్వకుశలమయీం ప్రవృత్తిం హారయిష్యన్ ప్రీతః తస్మై ప్రత్యగ్రైః కుటజ-కుసుమైః కల్పితార్ఘాయ ప్రీతిప్రముఖవచనం స్వాగతం వ్యాజహార 


ప్రతిపదార్థః

ప్రత్యాసన్నే నభసి = రానున్న శ్రావణమాసములో

దయితాజీవితాలమ్బనార్థీ సః=భార్య యొక్క జీవితమునకు ఆలంబన (దన్ను/సమర్థన) ఇవ్వాలని కోరుకున్నవాడు

జీమూతేన = మేఘముతో

స్వ-కుశలమయీం ప్రవృత్తిం = తన క్షేమసమాచారమును

హారయిష్యన్ = పంపబోతూ

ప్రీతః (సన్) = ప్రసన్నచిత్తుడు (అయి)

ప్రత్యగ్రైః కుటజకుసుమైః = అప్పుడే వికసించిన కొండమల్లె పూవులతో

కల్పితార్ఘాయ తస్మై = అర్ఘ్యమును సమర్పించబడిన అతడికి (మేఘుడికి)

ప్రీతిప్రముఖవచనం = ప్రీతి కలిగించే విధమైన మాటలను

స్వాగతం = ఆహ్వానమును

వ్యాజహార = పలికాడు


తాత్పర్యమ్

శ్రావణమాసము రాబోతున్నది. సమయంలో విరహాతిశయము చేత తన భార్యకు ప్రాణహాని కలగకుండా ఉండేందుకు మేఘము ద్వారా తన క్షేమసమాచారాన్ని తన భార్యకు తెలియపంపాలని అనుకున్నాడు అతడు. అప్పుడే వికసిస్తున్న కొండమల్లె పూవులను తెచ్చి పూజించి ప్రసన్నతతో స్నేహపూర్వకమైన మాటలతో స్వాగతించాడు.

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...