తస్మిన్నద్రౌ
శ్లోకః
తస్మిన్నద్రౌ కతిచిదబలావిప్రయుక్తః స కామీ
నీత్వా మాసాన్ కనకవలయభ్రంశరిక్తప్రకోష్ఠః ।
ఆషాఢస్య ప్రథమదివసే మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం దదర్శ॥1.2॥
పదవిభాగః
తస్మిన్ అద్రౌ కతిచిద్ అబలా-విప్రయుక్తః సః కామీ నీత్వా మాసాన్ కనక-వలయ-భ్రంశ-రిక్త-ప్రకోష్ఠః ఆషాఢస్య ప్రథమ-దివసే మేఘమ్ ఆశ్లిష్ట-సానుం వప్ర-క్రీడా-పరిణత-గజ-ప్రేక్షణీయం దదర్శ ॥
అన్వయః
తస్మిన్ అద్రౌ అబలావిప్రయుక్తః కామీ కనకవలయభ్రంశరిక్తప్రకోష్ఠః సః కతిచిద్ మాసాన్ నీత్వా ఆషాఢస్య ప్రథమదివసే ఆశ్లిష్టసానుం వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం మేఘం దదర్శ ॥
ప్రతిపదార్థః
తస్మిన్ అద్రౌ = ఆ కొండపై
అబలావిప్రయుక్తః = స్త్రీ (భార్య) వియోగములో ఉన్నవాడు
కామీ = కామముతో ఉన్నవాడు/కామార్తుడు
కనకవలయభ్రంశరిక్తప్రకోష్ఠః = బంగారు కంకణము జారి మణికట్టు బోసిగా ఉన్నవాడు
సః = అతడు
కతిచిద్ మాసాన్ = కొన్ని నెలలను
నీత్వా = గడిపి
ఆషాఢస్య = ఆషాఢము యొక్క
ప్రథమదివసే = మొదటి రోజు
ఆశ్లిష్టసానుం వప్రక్రీడాపరిణతగజప్రేక్షణీయం మేఘం = కొండ కొమ్మును పొదవి పట్టుకొని ఉన్నది,
రాళ్ళను చిమ్మే ఆటలో నిమగ్నమైన ఏనుగు వలె చూడదగ్గదీ అయిన మేఘమును
దదర్శ = చూసాడు
తాత్పర్యమ్
కామార్తుడైన
ఆ యక్షుడు భార్యావియోగియై ఆ కొండపై కొన్ని మాసాలు గడిపాడు. బక్కచిక్కాడు. అతడి చేతి మణికట్టుపై ఇప్పుడు కంకణం లేదు (వదులై ఎక్కడో పడిపోయింది). ఇంతలో ఆషాఢం వచ్చింది. ఆషాఢపు తొలిరోజున అతడు ఆ పర్వతసానువును ఆవరించిన ఒక మేఘాన్ని చూసాడు. కొండను పెళ్ళగించి ఎత్తివేసే ఆటలో ఉన్న ఏనుగులా ఉన్నది ఆ మేఘము.
Comments
Post a Comment