కశ్చిత్కాన్తావిరహగురుణా
శ్లోకః
కశ్చిత్కాన్తావిరహగురుణా స్వాధికారాత్ప్రమత్తః
శాపేనాస్తఙ్గమితమహిమా వర్షభోగ్యేణ భర్తుః ।
యక్షశ్చక్రే జనకతనయాస్నానపుణ్యోదకేషు
స్నిగ్ధచ్ఛాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు॥1.1॥
పదవిభాగః
కశ్చిత్-కాన్తా-విరహ-గురుణా స్వ-అధికారాత్ ప్రమత్తః శాపేన అస్తఙ్గమిత-మహిమా వర్ష-భోగ్యేన
భర్తుః
యక్షః చక్రే జనక-తనయా స్నాన-పుణ్య-ఉదకేషు స్నిగ్ధః-ఛాయా-తరుషు వసతిం రామగిరి ఆశ్రమేషు ॥
అన్వయః
స్వాధికారాత్ ప్రమత్తః కశ్చిత్ యక్షః కాన్తావిరహగురుణా వర్షభోగ్యేన భర్తుః శాపేన అస్తఙ్గమితమహిమా జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్ఛాయాతరుషు రామగిర్యాశ్రమేషు వసతిం చక్రే ॥
ప్రతిపదార్థః
స్వాధికారాత్ ప్రమత్తః కశ్చిత్ యక్షః = తన (వృత్తి) కర్తవ్యనిర్వహణలో అజాగ్రత్త చూపిన ఒకానొక
యక్షుడు
కాన్తావిరహగురుణా వర్షభోగ్యేన
భర్తుః శాపేన = భార్యావిరహము చేత అధికమైనది, ఏడాది పాటు అనుభవించవలసినదీ (అయిన)
యజమాని
యొక్క శాపముచేత
అస్తఙ్గమితమహిమా (సన్) = నశించిన మహిమ గలవాడు (అయి)
జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధచ్ఛాయాతరుషు రామగిర్యాశ్రమేషు = సీతామాత స్నానము చేసిన
పుణ్యజలాలతో, దట్టమైన చెట్ల నీడలతో ఉన్న రామగిరి పర్వతములోని ఆశ్రమములలో
వసతిం = నివాసమును
చక్రే = ఏర్పరచుకున్నాడు
తాత్పర్యమ్
కుబేరుడి భృత్యుడైన ఒక యక్షుడు శ్రద్ధాలోపం కారణంగా తన విధినిర్వహణలో పొరబాటు చేసాడు. అందుకు కోపించిన కుబేరుడు అతడిని శపించాడు. శాపకారణంగా భార్యావిరహముతో ఏడాదిపాటు కష్టతరమైన ప్రవాసజీవితాన్ని గడపాలి అతడు. అంతే కాదు, యథేచ్ఛాగమనము వంటి మహిమలనూ కోల్పోయాడు. రామగిరి అనే పర్వతంపై నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ పర్వతప్రాంతం దట్టమైన చెట్ల నీడలతో ఉంటుంది. సీతమ్మ తల్లి స్నానమాడి పునీతం చేసిన జలస్థానాలు అక్కడ ఉన్నాయి.
Comments
Post a Comment