తస్య స్థిత్వా కథమపి పురః


శ్లోకః

తస్య స్థిత్వా కథమపి పురః కౌతుకాధానహేతో-
రన్తర్బాష్పశ్చిరమనుచరో రాజరాజస్య దధ్యౌ ।
మేఘాలోకే భవతి సుఖినోఽప్యన్యథావృత్తి చేతః
కణ్ఠాశ్లేషప్రణయిని జనే కిం పునర్దూరసంస్థే ॥1.3


పదవిభాగః

తస్య స్థిత్వా కథమ్ అపి పురః కౌతుక-ఆధాన హేతోః అన్తర్బాష్పః చిరమ్ అనుచరః రాజరాజస్య దధ్య మేఘ-ఆలోకే భవతి సుఖినః అపి అన్యథా-వృత్తి చేతః కణ్ఠ-ఆశ్లేష-ప్రణయిని జనే కిం పునః దూర-సంస్థే 


అన్వయః

రాజరాజస్య అనుచరః అన్తర్బాష్పః కౌతుకాధాన హేతోః తస్య పురః స్థిత్వా కథమ్ అపి చిరమ్ దధ్యౌ. మేఘాలోకే (సతః) సుఖినః చేతః అపి అన్యథావృత్తి భవతి, కణ్ఠాశ్లేషప్రణయిని జనే దూరసంస్థే (సతి) కిం పునః 


ప్రతిపదార్థః

రాజరాజస్య = కుబేరుడి యొక్క

అనుచరః = అనుచరుడు

అన్తర్బాష్పః (సన్) = కన్నీటిని లోపలే ఉంచుకున్నవాడు (అయి)

కౌతుకాధాన హేతోః తస్య = కుతూహలమునకు కారణమైన మేఘము యొక్క

పురః = ఎదుట

కథమ్ అపి = ఏదో ఒక విధంగా

స్థిత్వా = నిలిచి

చిరమ్ = చాలా సేపు

దధ్యౌ = దుఃఖించాడు

మేఘాలోకే = మేఘమును చూసినప్పుడు

సుఖినః చేతః అపి = సుఖముగా ఉన్నవారి చిత్తము కూడా

అన్యథావృత్తి భవతి = కలత చెందుతుంది

కంఠాశ్లేషప్రణయిని జనే దూరసంస్థే (సతి) = కగలించుకోదగిన ప్రియురాలు దూరంగా ఉన్నప్పుడు

కిం పునః? =మళ్ళీ ఎందుకు (వేరే చెప్పాలా)?


తాత్పర్యమ్

ప్రణయభావనలను పురిగొల్పే మేఘం ముందు నిలబడి ప్రయత్నపూర్వకంగా తన కన్నీళ్ళను దిగమింగుకొని చాలాసేపు చింతించాడు, కుబేరుడి అనుచరుడైన యక్షుడు. మేఘాలను చూసినప్పుడు సుఖంగా ఉన్నవారికి సైతం కలవరపాటు కలుగుతుంది. కౌగిలించుకోదగిన ప్రేయసికి దూరంగా ఉన్నవారి సంగతి వేరే చెప్పాలా?

Comments

Popular posts from this blog

తస్యోత్సఙ్గే

తాముత్తీర్య వ్రజ

ప్రాప్యావన్తీనుదయనకథాకోవిదగ్రామవృద్ధాన్