సన్తప్తానాం త్వమసి శరణం
శ్లోకః
సన్తప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయాః
సన్దేశం మే హర ధనపతిక్రోధవిశ్లేషితస్య ।
గన్తవ్యా తే వసతిరలకా నామ యక్షేశ్వరాణాం
బాహ్యోద్యానస్థితహరశిరశ్చన్ద్రికాధౌతహర్మ్యా ॥1.7॥
పదవిభాగః
సన్తప్తానాం త్వమ్ అసి శరణం తత్ పయోద ప్రియాయాః సన్దేశం మే హర ధన-పతి-క్రోధ-విశ్లేషితస్య । గన్తవ్యా తే వసతిః అలకా నామ యక్ష-ఈశ్వరాణాం బాహ్య-ఉద్యాన స్థిత హర శిరః-చన్ద్రికా-ధౌత-హర్మ్యా ॥
అన్వయః
పయోద, త్వమ్ సంతప్తానాం శరణం అసి । తత్, ధనపతిక్రోధవిశ్లేషితస్య మే సన్దేశం ప్రియాయాః హర । బాహ్యోద్యానస్థితహరశిరశ్చన్ద్రికాధౌతహర్మ్యా అలకా నామ యక్షేశ్వరాణాం వసతిః తే గన్తవ్యా ॥1.7॥
ప్రతిపదార్థః
పయోద = ఓ మేఘుడా
త్వమ్ = నీవు
సన్తప్తానాం = తాపము (వేడి) తో పీడించబడుతున్న వారికి
శరణం అసి = శరణము
తత్ = అందుచేత
ధనపతిక్రోధవిశ్లేషితస్య మే = కుబేరుడి కోపము చేత (భార్య నుంచి) విడిపోయి ఉన్న నా యొక్క
సన్దేశం = సందేశమును
ప్రియాయాః = ప్రియురాలికై
హర = తీసుకొని వెళ్ళుము
బాహ్యోద్యానస్థితహరశిరశ్చన్ద్రికాధౌత-హర్మ్యా = వెలుపల ఉన్న తోటలలో ఉన్న శివుడి తలపైని చంద్రుడి కాంతితో కడగబడుతున్న భవనములను కలిగినది
అలకా నామ = అలకా అని పేరున్నది (అయిన)
యక్షేశ్వరాణాం = యక్షరాజుల యొక్క
వసతిః = నివాసము
తే = నీకు
గన్తవ్యా = పోదగినది
తాత్పర్యమ్
“ఓ మేఘుడా, తాపముచేత బాధించబడుతున్నవారికి నీవే దిక్కు. అందుచేత – కుబేరుడి శాపము కారణంగా భార్యావియుక్తుడైన నా సందేశాన్ని నా భార్య కొరకు తీసుకొని వెళ్ళు. (నగరానికి) వెలుపలనున్న ఉద్యానవనములోనున్న మహాశివుడియొక్క జటాజూటచంద్రుడి కాంతితో ఏ నగరపు
సౌధాలు కడగబడుతున్నాయో, యక్షపతి రాజధానియైన ఆ అలకాపురికి వెళ్ళాలి
నీవు.”
Comments
Post a Comment