త్వామారూఢం పవనపదవీమ్


శ్లోకః
త్వామారూఢం పవనపదవీముద్గృహీతాలకాన్తాః
ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాదాశ్వసన్త్యః ।
కః సన్నద్ధే విరహవిధురాం త్వయ్యుపేక్షేత జాయాం
న స్యాదన్యోఽప్యహమివ జనో యః పరాధీనవృత్తిః॥1.8

పదవిభాగః
త్వామ్-ఆరూఢం పవన-పదవీమ్ ఉద్గృహీత-అలకా-అన్తాః ప్రేక్షిష్యన్తే పథికవనితాః ప్రత్యయాత్ ఆశ్వసన్త్యః కః సన్నద్ధే విరహ-విధురాం త్వయి ఉపేక్షేత జాయాం స్యాత్ అన్యః అపి అహమ్ ఇవ జనః యః పర-ఆధీనవృత్తిః

అన్వయః
ప్రత్యయాద్ ఆశ్వసన్త్యః పథికవనితాః ఉద్గృహీతాలకాన్తాః పవనపదవీమ్ ఆరూఢం త్వామ్ ప్రేక్షిష్యన్తే యః అన్యః జనః అహమ్ ఇవ అపి పరాధీనవృత్తిః న స్యాద్ త్వయి సన్నద్ధే విరహవిధురాం జాయాం కః ఉపేక్షేత

ప్రతిపదార్థః
పథికవనితాః = ప్రవాసములోనున్నవారి భార్యలు
ప్రత్యయాత్ = నమ్మకము వలన
ఆశ్వసన్త్యః = ఊరడిల్లినవారు
ఉద్గృహీతాలకాన్తాః (సత్యాః)= ముంగురుల కొసలను పైకెత్తుకొన్నవారు (అయి)
పవనపదవీమ్ ఆరూఢం త్వామ్ = వాయుమార్గమును అధిరోహించిన నిన్ను
ప్రేక్షిష్యన్తే = చూడనున్నారు
యః అన్యః జనః = ఇతరుడు
అహమ్ ఇవ అపి = నా వలెనే
పరాధీనావృత్తిః = ఇతరులపై ఆధారపడిన జీవితము కలవాడు
స్యాత్ = అయి ఉండడో
త్వయి సన్నద్ధే = నీవు చెంతనుండగా
విరహవిధురాం జాయాం = విరహపీడితయైన భార్యను
కః = ఎవడు
ఉపేక్షేత = ఉపేక్షించగలడు?

తాత్పర్యమ్
ప్రవాసములో ఉన్నవారి భార్యలు, తమ భర్తలు తిరిగి వస్తారన్న నమ్మకంతో ఊరడిల్లుతూ తమ ముంగురులను పైకెత్తుకొని గగనమార్గములోని నిన్ను చూడనున్నారు. నావంటి అస్వతంత్రుడు కాక వేరెవరు నీ సమక్షంలో [వానాకాలంలో] విరహదుఃఖితురాలైన భార్యను నిర్లక్ష్యము చేయగలడు?

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...