జాతం వంశే భువనవిదితే

శ్లోకః

జాతం వంశే భువనవిదితే పుష్కరావర్తకానాం
జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః ।
తేనార్థిత్వం త్వయి విధివశాద్ దూరబన్ధుర్గతోఽహం
యాచ్ఞా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా 1.6


పదవిభాగః

జాతం వంశే భువన-విదితే పుష్కల-ఆవర్తకానాం జానామి త్వాం ప్రకృతి-పురుషం కామ-రూపం మఘోనః; తేన-అర్థిత్వం త్వయి విధివశాత్  దూర-బన్ధుః గతః అహం, యాచ్ఞా మోఘా వరమ్ అధిగుణే అధమే లబ్ధ-కామా


అన్వయః

భువనవిదితే పుష్కలావర్తకానాం వంశే జాతం మఘోనః ప్రకృతిపురుషం కామ-రూపం త్వాం జానామి; తేన విధివశాద్ దూరబన్ధుః అహం త్వయి అర్థిత్వం గతః; అధిగుణే మోఘా యాచ్ఞా వరం, అధమే (వరమ్)


ప్రతిపదార్థః

భువనవిదితే పుష్కలావర్తకానాం వంశే = విశ్వవిఖ్యాతమైన పుష్కలావర్తకముల వంశములో

జాతం = పుట్టిన వాడిని

మఘోనః = ఇంద్రుడి యొక్క

ప్రకృతిపురుషం= అనుచరుడిని

కామరూపం = ఇష్టమ్ము వచ్చిన రూపమును ధరించగల శక్తి   ఉన్నవాడిని

త్వాం = నిన్ను

జానామి = ఎరుగుదును

తేన = అందుచేత

విధివశాత్ = అదృష్టం (దురదృష్టం) కొద్దీ

దూరబన్ధుః అహం = బంధువుల నుంచి దూరమైన నేను

త్వయి అర్థిత్వం గతః = నిన్ను వేడుకుంటున్నాను

అధిగుణే = ఉత్తమగుణములు ఉన్నవారి యందు

మోఘా యాచ్ఞా = విఫలమైన కోరిక

వరం = శ్రేష్ఠము

అధమే = అధముల యందు

(వరమ్) = (శ్రేష్ఠము) కాదు


తాత్పర్యమ్

(యక్షుడు మేఘముతో అంటున్న మాటలే మిగతా కావ్యమంతా)
మేఘుడా, నీవు విశ్వవిఖ్యాతమైన పుష్కలావర్తకముల వంశములో పుట్టినవాడవని, కామరూపుడివని, ఇంద్రుడి అనుచరుడవని నాకు తెలుసును. అందుకే, దురదృష్టం కొద్దీ భార్యావియోగములోనున్న నేను నిన్ను అర్థిస్తున్నాను. అధములను అడిగి తీర్చుకున్న కోరిక కన్నా గొప్పవారిని కోరిన కోరికఅది నెరవేరనప్పటికీశ్రేష్ఠతరము కదా!”

Comments

Popular posts from this blog

త్వయ్యాయత్తం కృషిఫలమితి

తాముత్తీర్య వ్రజ

తం చేద్ వాయౌ సరతి...