ధూమజ్యోతిఃసలిలమరుతాం
శ్లోకః
ధూమజ్యోతిఃసలిలమరుతాం సంనిపాతః క్వ మేఘః
సన్దేశార్థాః క్వ పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః ।
ఇత్యౌత్సుక్యాదపరిగణయన్ గుహ్యకస్తం యయాచే
కామార్తా హి ప్రకృతికృపణాశ్చేతనాచేతనేషు ॥1.5॥
పదవిభాగః
ధూమ-జ్యోతిః-సలిల-మరుతాం సన్నిపాతః క్వ మేఘః సందేశ-అర్థాః క్వ పటు-కరణైః ప్రాణిభిః ప్రాపణీయాః ఇతి ఔత్సుక్యాత్ అపరిగణయన్ గుహ్యకః తం యయాచే కామ-ఆర్తాః హి ప్రకృతి-కృపణాః చేతన-అచేతనేషు ॥
అన్వయః
గుహ్యకః “ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః మేఘః క్వ, పటుకరణైః ప్రాణిభిః ప్రాపణీయాః
సందేశార్థాః క్వ?” ఇతి ఔత్సుక్యాద్ అపరిగణయన్ తం యయాచే. కామార్తాః చేతనాచేతనేషు ప్రకృతికృపణాః హి ॥
ప్రతిపదార్థః
గుహ్యకః =(ఆ) యక్షుడు
ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః మేఘః క్వ = పొగ, కాంతి, నీరు, గాలి కలిసినందున ఏర్పడే మబ్బు ఎక్కడ?
పటుకరణైః ప్రాణిభిః = బలమైన ఇంద్రియములను కలిగి యున్న ప్రాణుల చేత
ప్రాపణీయాః సందేశార్థాః క్వ = పంపించదగినవి అయిన సందేశాలు ఎక్కడ?
ఇతి = అని
ఔత్సుక్యాద్ = ఉత్సాహము వలన
అపరిగణయన్ =
లెక్క చేయక
తం = అతడిని
యయాచే = అడిగాడు
కామార్తాః = కామపీడితులు
చేతనాచేతనేషు = చేతన కలిగిన ప్రాణుల, చేతన లేని వస్తువుల యందు
ప్రకృతికృపణాః హి = (తేడాను గమనించని) స్వాభావికంగా మూఢులు కదా.
తాత్పర్యమ్
“పొగ, వెలుతురు, నీరు, గాలి – వీటి కలయికతో ఏర్పడ్డ మేఘమెక్కడ? ఇంద్రియసంయుక్తాలైన ప్రాణులచేతనే పంపించవలసిన సందేశాలు ఎక్కడ?”, అని వితర్కించకుండానే ఉబలాటంతో ఉన్న ఆ యక్షుడు ఆ మేఘాన్నిఅర్థించాడు. కామపీడితులైన వారు ప్రాణులకు అప్రాణులకు మధ్య భేదాన్ని గమనించరు కదా.
Comments
Post a Comment